ప్రతిపక్షాలను చూసి భయపడుతున్న సీఎం జగన్.. నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-02-05 14:40:19.0  )
ప్రతిపక్షాలను చూసి భయపడుతున్న సీఎం జగన్.. నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్‌: నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో కుదేలైందని, ప్రతిపక్షాలను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన ‘బై బై జగన్’ ప్లకార్డులు పట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయండానే సీఎం జగన్ మళ్లీ ప్రజల వద్దకు ఓట్ల కోసం వస్తున్నాడని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ధైర్యం కూడా చేయడం లేదంటూ ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులను నట్టేటా ముంచారని, జాబ్ క్యాలెండర్ ఏమైందంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్తున్న తమను ఆపే హక్కు పోలీసులకు లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు వైసీపీని పాతరేయడం ఖాయమని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు.

Read More..

నారా లోకేశ్‌తో టచ్‌లో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

Advertisement

Next Story