- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు శ్రీకాకుళంకు సీఎం జగన్
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో పర్యటించనున్నారు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపనచేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి సీఎంవో పర్యటన వివరాలను విడుదల చేసింది. బుధవారం ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.15 గంటలకు మూలపేట చేరుకుంటారు.10.30 – 10.47 గంటల మధ్య మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తారని తెలిపింది. అలాగే గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాల్లోపాల్గొంటారని వెల్లడించింది. 11.25 – 11.35 గంటల మధ్య నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేయనున్నారు.
దీంతోపాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు,హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 11.40 – 12.30 గంటల మధ్య బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు అని సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read more:
ఉక్కిరిబిక్కిరి అవుతున్న సీఎం జగన్.. తాజా పరిణామాలతో పార్టీ క్యాడర్ సైతం బేజారు!