బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్

by Rajesh |   ( Updated:2023-05-22 06:24:54.0  )
బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: మచిలీపట్నంలోని బందరు పోర్టు నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభించారు. సీఎం టూర్ నేపథ్యంలో మచిలీపట్నంలో సందడి నెలకొంది. మచిలీపట్నంలో తొలుత జగన్ గంగమ్మకు పూజలు నిర్వహించారు. కాసేపట్లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. బందరు పోర్టు నిర్మాణంతో ఇక్కడి ప్రజల చిరకాల వాంచ నెరవేరనుంది.

సుమారు రూ.16,000 వేల కోట్లతో నిర్మించే రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడు గేట్ వే, మూలపేట పోర్టుల నిర్మాణాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 75 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణాలోని ఖమ్మం, కరీంగనగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా కానుంది.

Read more:

YS వివేకా కేసు : అవినాష్ రెడ్డికి సుప్రీంలో బిగ్ షాక్!

Advertisement

Next Story

Most Viewed