YS Viveka Murder Case: గురించి అవినాశ్ రెడ్డి చెప్తే నేను జగన్‌కు చెప్పా: సీఎం ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి

by Seetharam |
YS Viveka murder
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ‌ఎస్‌డీ పి.కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ సాక్షిగా పేర్కొంది. వివేకా హత్యకేసులో ఫైనల్ చార్జిషీట్‌ను సీబీఐ ఈ ఏడాది జూన్ 30న అందజేసింది. 140 పేజీలు కలిగిన ఈ చార్జిషీట్‌ను సెకండ్ సప్లిమెంటరీ ఫైనల్ చార్జిషీట్‌గా సీబీఐ తెలిపింది. ఈ హత్య కేసులో ఓఎస్‌డీ పి.కృష్ణమోహన్ రెడ్డిని సాక్షిగా సీబీఐ తెలిపింది. ఈ మేరకు సీబీఐ వాంగ్మూలం సమర్పించింది. ఇకపోతే గతంలో ఓఎస్‌డీ పి.కృష్ణ మోహన్ రెడ్డిని సీబీఐ విచారించింది. ఈ విచారణలో ఓఎస్‌డీ వాంగ్మూలం ఇచ్చారు. ‘సమావేశం జరుగుతుండగా అటెండర్ నవీన్ తలుపు తెరిచారు. సమావేశం నుంచి ఒకసారి బయటకు రావాలని నవీన్ నన్ను కోరాడు. ఎంపీ అవినాశ్ రెడ్డి మాట్లాడుతారని నవీన్ నాకు ఫోన్ ఇచ్చారు. అయితే ఫోన్‌లో వైఎస్ వివేకా మరణించారని అవినాశ్ రెడ్డి తనకు తెలియజేశారని వెల్లడించారు. ఎలా మరణించారని అడగ్గా బాత్ రూమ్‍లో మృతదేహం ఉందని.. బాత్‍రూమ్‍లో చాలా రక్తం ఉందని కూడా అవినాశ్ నాకు తెలిపారు. అయితే వైఎస్ జగన్‍కు సమాచారం ఇవ్వండని అవినాశ్ చెప్పి ఫోన్ కట్ చేశారు’ అని ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి సీబీఐకు వాంగ్మూలం ఇచ్చారు. ఎంపీ అవినాశ్ రెడ్డి సమాచారం చెప్పిన వెంటనే ఈ విషయాన్ని వైఎస్ జగన్‍కు నేను చెవిలో చెప్పాను. బెడ్‍రూం, బాత్‍రూంలో రక్తం విషయం కూడా చెప్పాను. అనంతరం జగన్ ముందు ఇంటికి వెళ్లి ఆ తర్వాత పులివెందుల వెళ్లారు’ అని సీబీఐకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఎంపీ అవినాశ్ రెడ్డితో ఐదుసార్లు ఎందుకు మాట్లాడారని సీబీఐ ప్రశ్నించింది. వైఎస్ జగన్ పర్యటన కోసమే ఐదుసార్లు ఫోన్ చేసి ఉంటా. వైఎస్ జగన్ ఫోన్ వాడరు. పీఏ లేదా నా ఫోన్‍లోనే మాట్లాడతారు’ అని ఓఎస్‍డీ పి.కృష్ణమోహన్ రెడ్డి సీబీఐకు వాంగ్మూలం ఇచ్చారు.

Read more : Latest Andhra Pradesh News


Advertisement

Next Story