- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయవాడ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ విచారం: మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని...గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీచేశారు. ఇకపోతే విజయవాడలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రూ బస్టాండ్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కండక్టర్, ఓ మహిళా, మరో చిన్నారి కూడా మృతి చెందారు. ప్లాట్ ఫామ్ 12 దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిలై ఫ్టాట్ ఫాం పైకి దూసుకెళ్లిన దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. డ్రైవర్ రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.