నేనంటే ఏంటో సీఎం జగన్‌కు తెలుసు.. మంత్రి అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
నేనంటే ఏంటో సీఎం జగన్‌కు తెలుసు.. మంత్రి అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్‌ : సీఎం జగన్‌కు నేనంటే ఏంటో తెలుసని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఇవాళ ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన భవిష్యత్తుపై ఎలాంటి ఆత్రుతా లేదని తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ఇదే నెలలో కర్నూల్‌లో రూ.2,500 కోట్లతో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ శంకుస్థాపనపై సీఎంతో చర్చించినట్లుగా పేర్కొన్నారు. నియోజకవర్గ ఇంచార్జీల మార్పుపై తమ మధ్య చర్చ జరగలేదని వెల్లడించారు. తాను పెందుర్తి, చోడవరం నుంచి పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కేవలం ప్రచారాలు మాత్రమేనని ఖండించారు. సీఎం జగన్‌కు అమర్‌నాథ్ అంటే ఎంటో తెలుసని.. తనకు ఏం చెయాలో సీఎం జగన్‌కు తెలుసునని అన్నారు.

Advertisement

Next Story