ఎన్నికల వేళ సుడిగాలి పర్యటనకు సిద్ధమైన సీఎం జగన్

by Mahesh |
ఎన్నికల వేళ సుడిగాలి పర్యటనకు సిద్ధమైన సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో స్పీడును పెంచాయి. ఇందులో భాగంగా అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి ప్రభుత్వం లోకి వచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అభివృద్ధి పనులతో పాటు పార్టీ సమావేశాలు, సభలు నిర్వహిస్తున్న ప్రచారం చేస్తుంది. మరోవైపు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలు అయిన టీడీపీ, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని వైసీపీపై ఎన్నికల శంఖారావానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత సీఎం జగన్ తన స్పీడును పెంచారు. దాదాపు 20 రోజుల్లో రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేయడాని ఆయన సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే పార్టీలోని కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రలతో జగన్ సమీక్ష నిర్వహించారు. రోజుకు 2-3 సభలు, రోడ్ షోలు నిర్వహించేలా భారీ ప్లాన్ చేయాలని పార్టీ నేతలకు జగన్ తెలిపినట్లు సమాచారం అందుతుంది. ఈ సభలు, సమావేశాలు కుడా ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించి జన సమీకరణ లో పోటీ ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు. ముఖ్యంగా తమ అభ్యర్థుల బలంగా ఉన్న కీలక నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, విలైనంత త్వరగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని జగన్ చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed