- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pm Modiతో Cm Jagan అత్యవసర భేటీ ఆంతర్యమేంటో !
- సీఎం జగన్ఢిల్లీ పయనం
- పీఎం మోడీ, ఇతర మంత్రులను కలవనున్న సీఎం
- అప్పుల తిప్పల్లో భాగమా..
- కేంద్ర మంత్రుల దాడికి తెప్పరిల్లుకోలేకనా ?
దిశ, ఏపీ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ పెద్దల ఎత్తుగడలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. లోపాయికారిగా సహకరించే ప్రభుత్వాలు, నాయకులకు అవసరమైనప్పుడు సహకరిస్తుంటారు. ఏదైనా కార్యం వాళ్లతో కావాల్సినప్పుడు ముందుగా విమర్శనాస్త్రాలు ఎక్కు పెడతారు. తర్వాత దారికి తెచ్చుకుంటుంటారు. ఇప్పుడూ అంతే. పీఎం మోడీతో జగన్భేటీ వెనుక ఇలాంటి కారణాలుంటాయి. అప్పుల తిప్పల్లో భాగమై ఉండొచ్చు లేదా కేంద్ర సర్కారు ఒత్తిడితో చేపట్టాల్సిన మరేదైనా కార్యం అయ్యుండొచ్చు. ఇవన్నీ ఢిల్లీ పెద్దలకు, జగన్‌కు కొత్తేమీ కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక జగన్ఢిల్లీ పర్యటనంటే కేంద్రం వద్ద సాగిల పడడానికేనంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. అత్యవసర భేటీ వెనుక ఇంకేదో ఉందంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
సహజంగా సీఎం వైఎస్జగన్ఢిల్లీ పర్యటనంటే కొద్దిరోజుల ముందే ఖరారవుతుంది. కేవలం రెండు రోజుల్లోపే ప్రధానితో భేటీ అంటే రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు తెరమీదకు వస్తుంటాయి. ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు వచ్చి వెళ్లిన తర్వాత నుంచి సీఎం జగన్మొదలుకొని మంత్రుల దాకా జనసేనాని పవన్‌ను టార్గెట్‌చేయడం ఎక్కువైంది. ఇది టీడీపీని వెనక్కి కొట్టే వ్యూహమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా, వైజాగ్‌స్టీల్‌ప్లాంట్, పోలవరం, విభజన హామీల గురించి వైసీపీ ఎంపీలు లేవనెత్తారు. అలా మాట్లాడకుంటే రాష్ట్ర ప్రజల్లో పలుచనై పోతామనే ఆందోళన లోలోపల దిగమింగుతూనే గొంతు సవరించుకున్నారు. వీటిపై కేంద్ర మంత్రులు కుండబద్దలు కొట్టినట్లు సమాధానమిచ్చారు.
హోదా సంగతి మర్చిపొమ్మన్నారు. పోలవరం ఇప్పట్లో పూర్తికాదని చెప్పేశారు. విశాఖ స్టీల్‌ప్లాంటు అమ్మకం నుంచి వెనక్కి తగ్గేదే లేదని తేల్చిపారేశారు. దీంతో అధికార వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా అయిపోయింది. కేంద్ర మంత్రులు అంతటితో ఆగలేదు. లక్షా 80 వేలకు పైగా ఐఏవై ఇళ్లు మంజూరు చేస్తే కేవలం 5 గృహాలు మాత్రమే కట్టారని ఎత్తిపొడిచారు. రాష్ట్రంలో రోజువారీ కూలీల ఆత్మహత్యలు మూడున్నరేళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. ఇక్కడ వ్యభిచార వృత్తి కూడా పెరుగుతోందని సెలవిచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్అయితే ఓ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే స్థితిలో లేదని పరోక్షంగా చురకలు వేశారు. వీటి మీద వైసీపీ మంత్రులు, ఎంపీల నుంచి ఎలాంటి స్పందన లేదు.
తాజాగా స్మార్ట్‌మీటర్ల అంశం రగులుతోంది. దాదాపు మూడు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నట్లు విపక్షాలు ఘోషిస్తున్నాయి. రిషికొండపై నిగ్గు తేల్చడానికి వేసిన అథారిటీ కమిటీలో కేంద్ర అధికారులను నియమించడాన్ని వైసీపీ సర్కారు జీర్ణించుకోలేకపోతోంది. వీటన్నింటిపై ప్రధాని మోడీకి సీఎం జగన్వివరించనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రతీ మంగళవారం అప్పుల కోసం ఆర్బీఐ దగ్గరకు పరుగులు దీయాల్సి వస్తోంది. నెలాకరు వచ్చిందంటే అప్పులకు వాయిదాలతోపాటు ఉద్యోగుల జీతాలు, సామాజిక పింఛన్లకు సర్దుబాటు చేయడం తలకు మించిన పనవుతోంది. అందువల్ల అదనపు రుణాలు తెచ్చుకునేందుకు అనుమతులు, వివిధ స్కీముల కింద నిల్చిపోయిన గ్రాంట్ల గురించి అడిగే అవకాశముంది.
రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర పెద్దలు కొన్ని అంశాలను ముందుకు తెచ్చే అవకాశం లేకపోలేదు. అందులో ప్రధానమైంది జెన్కో ప్లాంట్లను ప్రైవేటుకు లీజుకు ఇవ్వడం. రెండోది ఇప్పటికీ ఖరారు కాని బొగ్గు కొనుగోలు టెండర్ల గురించి అదానీకి లబ్ది చేకూరేట్లు కేంద్రం ఒత్తిడి చేయొచ్చని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంకా కేంద్ర విద్యుత్, అర్బన్సంస్కరణలను వేగవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం గురించి మోడీతో సీఎం జగన్చర్చించే అవకాశముందని చెబుతున్నారు. ఇంకోవైపు టీడీపీతో బీజేపీ పెద్దల వైఖరిలో ఏమైనా మార్పులు వచ్చాయా అనేది కూడా వైసీపీని కలవరపెడుతోంది. ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకునే మోడీతో జగన్భేటీ అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.