- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో సీఎం జగన్ బిజీబిజీ: నేటి రాత్రి అమిత్ షాతో భేటీ
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. మెుదటి రోజైన శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో భేటీ అయ్యారు. ఇకపోతే రెండోరోజైన శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ప్రారంభమైన వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సుకు సీఎం జగన్ హాజరయ్యారు. సీఎం వైఎస్ జగన్‌తోపాటు సీఎ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిలు సదస్సులో పాల్గొన్నారు. ఈ వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సుకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు/హోంశాఖ మంత్రులు /అధికారులు హాజరయ్యారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలైన రాష్ట్రాలలో చేపట్టాల్సిన జాయింట్ ఆపరేషన్‌లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే నక్సల్స్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో వారి అణిచివేతకు చర్యలపైనా చర్చించనున్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాలలో అభివృద్ధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చించనున్నారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, రెసిడెన్షియల్ పాఠశాలలు, బ్యాంకులు, టెలిఫోన్ టవర్లు ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించనున్నారు. అలాగే నక్సల్స్ ఏరివేతకు సంబంధించి పోలీసు బలగాల ఆధునీకరణ, మెరుగైన మౌలిక వసతులు, రిజర్వ్ బెటాలియన్ ఏర్పాటు, హెలికాప్టర్లు, యూఏవీలు తదితర అంశాలపైనా సమావేశంలో చర్చించనున్నారు.
రాత్రికి అమిత్ షాతో భేటీ
ఇదిలా ఉంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల తర్వాత హోంమంత్రితో భేటీకి అపాయింట్మెంట్ ఖరారు అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు రాజకీయపరమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్ల తెలుస్తోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్, చంద్రబాబు అరెస్ట్ తదితర అంశాలపైనా సీఎం వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశాలు ఉన్నట్లు వైసీపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.