మంత్రులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్.. సరిగ్గా పని చేయకపోతే పీకి పారేస్తా అంటూ

by Kavitha |   ( Updated:2024-09-04 14:56:27.0  )
మంత్రులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్.. సరిగ్గా పని చేయకపోతే పీకి పారేస్తా అంటూ
X

దిశ, వెబ్‌డెస్క్: వరద ప్రభావిత ప్రాంతాల్లో సరిగ్గా పని చేయకపోతే తీసివేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. తనకు పని చేయని మంత్రులు అక్కరలేదంటూ తేల్చిచెప్పారు. జక్కంపూడిలో(jakkampudi) వరద సహాయ చర్యల్లో సరిగ్గా పని చేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు..

గత ఐదేళ్ల కాలంలో అధికార వ్యవస్థకు పెరాలసిస్‌ వచ్చిందంటూ దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు.. నాకు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి తీసుకొచ్చారని ఆయన చెప్పారు. అందుకే జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేశానని, కాబట్టి ఎవ్వరినీ ఊపేక్షించేది లేదు అన్నారు.. అంతేకాదు.. మంత్రులు కూడా సరిగా పనిచేయకపోతే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.. కాగా, వరద ప్రభావానికి గురైనటువంటి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రకటించారు. జక్కంపూడి(jakkampudi), సింగ్ నగర్ (singh nagar), సితార సెంటర్(Sithara Centre) ప్రాంతాల్లోకి ఆయన జేసీబీపై వెళ్లి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 5 అడుగుల మేర నీళ్లు ఉండడంతో వాహనాలు అక్కడికి పంపడానికి ఇబ్బంది ఏర్పడింది.. జేసీబీ వాహనంపై కూర్చున్న లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల కష్టసుఖాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed