- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన..షెడ్యూల్ ఇదే!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రేపు ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు బయలుదేరతారు. దీంతో 11.40కి కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 11.50కి వానపల్లిలోని పల్లాలమ్మ గుడి వద్దకు వస్తారు. 11.50 నుంచి 1.30 గంటల వరకు గ్రామ సభలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. 2 గంటల నుంచి 2.20 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో భేటీ అవుతారు. 2.20 గంటలకు వానపల్లి గ్రామం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2.35 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌కి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45కు ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.35 గంటలకు తెలంగాణ రాష్ట్రం బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి వెళ్లనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు.