నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన

by Anjali |
నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి పర్యటన కావడం విశేషం. కాగా మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12. 30 గంటలకు కుప్పం చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12. 55 గంటలకు శాంతిపురం మండలం జల్లిగానిపల్లి, చిన్నారిదొడ్డి గ్రామాల్లో హంద్రీనీవా ప్రాజెక్టు కాలువను పరిశీలించనున్నారు. అక్కడినుంచి మధ్యాహ్నం 2. 10 గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బాబు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అలాగే సాయంత్రం 4. 35 గంటలకు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక రెండో రోజు బుధవారం ఉదయం సీఎం చంద్రబాబు అక్కడే అర్జీలను స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గంలోని అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 4. 10 గంటలకు చంద్రబాబు తిరుగు ప్రయాణాన్ని విజయవాడకు చేరుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed