TDP: టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-26 05:44:39.0  )
TDP: టీడీపీ సభ్యత్వ నమోదును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ(TDP) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని(Membership Enrollment Program)ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు(AP CM Nara Chandrababu Naidu) కొద్దసేపట్లో (Will start) ప్రారంభించనున్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదును మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేవలం రూ.100 చెల్లించి సభ్యత్వ నమోదు చేసుకోవచ్చు. లక్ష రూపాయలు కడితే శాశ్వత సభ్యత్వ నమోదు లభిస్తుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు వల్ల పార్టీ మరింత బలోపేతం కానుంది. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి ఐదు లక్షల రూపాయల ఇన్సురెన్స్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది.

గతంలో రెండు లక్షలు ఉన్న ఇన్సురెన్స్ ను ఐదు లక్షలకు పెంచింది. చనిపోయిన కార్యకర్తలకు తక్షణ సాయం క్రింద పదివేల రూపాయలు అందిస్తారు. సభ్యత్వ నమోదుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్ని ఏర్పాట్లు చేశారు. వాట్సప్, టెలిగ్రామ్, తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా కూడా సభ్యత్వ నమోదు కొనసాగించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed