CM Chandrababu: నా భార్య గురించి మాట్లాడితే కన్నీరు పెట్టుకున్నా.. సీఎం చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-11-07 09:13:41.0  )
CM Chandrababu: నా భార్య గురించి మాట్లాడితే కన్నీరు పెట్టుకున్నా.. సీఎం చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రంలో గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఇవాళ అమరావతి (Amaravati)లోని తాళ్లాయపాలెం (Thallayapalem)లో జీఐఎస్ సబ్ స్టేషన్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ.. వైసీపీ సర్కార్ పొలవరం (Polavaram) పూర్తి చేయాల్సిందే పోయి ప్రాజెక్టులో కీలక భాగం అయిన డయాఫ్రమ్ వాల్‌ (Diaphragm Wall)ను పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ఎక్కడపడితే అక్కడ రూ.10 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని ఫైర్ అయ్యారు. అంతకు ముందు విద్యుత్ ఒప్పందాలను కూడా రద్దు చేశారని ఆయన తెలిపారు.

వైఎస్ జగన్ (YS Jagan) వల్ల పలు దేశాల పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి కూడా భయపడ్డారని గుర్తు చేశారు. పేదలపై విద్యుత్ భారానికి కారణం గత ప్రభుత్వమేనని అన్నారు. ఒక్క యూనిట్ విద్యుత్ వాడకుండనే రూ.వేల కోట్లు చెల్లించారని ఆక్షేపించారు. కమీషన్ల కోసం అడ్డగోలుగా విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు. 9 సార్లు కరెంట్ చార్జీలను పెంచి రూ.36 వేల కోట్ల భారం వేశారని వివరించారు. ఇక సోషల్ మీడియా (Social Media)లో ప్రభుత్వంలో ఉన్న వారిపై మదమెక్కిన ఆంబోతుల్లాగా విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నారని కామెంట్ చేశారు. ఆడబిడ్డలు అని చూడకుండా అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ (YCP) నాయకులు పూర్తిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

నిండు అసెంబ్లీలో తన భార్యపై కామెంట్లు చేశారని.. బాంబులకు భయపడని తాను భార్య గురించి మాట్లాడితే కన్నీరు పెట్టుకున్నానని సీఎం ఎమోషనల్ అయ్యారు. వైసీపీ (YCP) వాళ్లకు 11 సీట్లు కాదు.. ఒక్క సీటు కూడా గెలిచేందుకు అర్హత లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. తనను, పవన్(Pavan) కుటుంబ సభ్యులు, హోమంత్రి అనిత (Home Minister Anitha)పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. తానెప్పుడూ రాజకీయం చేయలేదని.. ఒకవేళ ఆ పనే చేయాలనుకుంటే ఎవరినీ వదిలిపెట్టే వాడిని కాదన్నారు. ఇక నుంచి హద్దులు మీరి ప్రవర్తిస్తే.. వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


Read More..

CM Chandrababu: అమరావతిని ఎడారిగా మార్చేశారు.. సీఎం చంద్రబాబు ఫైర్

Advertisement

Next Story

Most Viewed