అన్నదానానికి తొలిసారి శ్రీకారం చుట్టింది ఆయనే: సీఎం చంద్రబాబు

by srinivas |
అన్నదానానికి తొలిసారి శ్రీకారం చుట్టింది ఆయనే: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అన్నదానికి తొలిసారి శ్రీకారం చుట్టింద ఎన్టీ రామారావు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీ రామారావు సీఎం అయినప్పుడు తిరుపతిలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. గుడివాడలో అన్న క్యాంటీన్‌ను చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2014-19 కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, కానీ జగన్ రావడంతోనే వాటిని రద్దు చేశారని తెలిపారు. వైఎస్ పేరు పెట్టుకుని అన్నా క్యాంటీన్లు నడపాలని విజ్ఞప్తి చెప్పినా జగన్ వినలేదని చెప్పారు. ప్రభుత్వం ఒప్పుకోకపోయినా దాతల సాయంతో నడుపుతామని చెప్పినా జగన్ అనుమతించలేదని తెలిపారు.

సెప్టెంబర్ చివరి వరకూ 203 అన్న క్యాంటీన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అన్ని మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తద్వారా పేదలకు రూ. 5కే భోజనం పెడతామన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని, తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చారు. మంచి కార్యక్రమానికి డబ్బులు ఖర్చుపెడితే ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story

Most Viewed