- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu:శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు
దిశ,శ్రీశైలం:ద్వాదశంలో రెండవ జ్యోతిర్లింగం. ఆరవ అష్టాదశ శక్తి పీఠం. ఇలలో వెలసిన కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం గురువారం ఉదయం 11.10 గంటలకు సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆలయ సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదమంత్రాలతో స్వామివారి దర్శనార్థం ఆలయంలోకి తీసుకెళ్లిన అర్చకులు. ఆలయంలో ప్రధమంగా రత్నగర్భ గణపతిని దర్శించుకున్న ముఖ్యమంత్రి అనంతరం శ్రీశైలం మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చన కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ముఖ్యమంత్రి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయం బయట ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు రూ.12 కోట్ల ఖర్చుతో శ్రీ స్వామి అమ్మవార్లకు బహుకరించిన బంగారు రథాన్ని ముఖ్యమంత్రివర్యులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, డీఐజీ కే ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఆలయ ఈఓ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.