CM Chandrababu:ఒలింపిక్స్‌ విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు

by Jakkula Mamatha |
CM Chandrababu:ఒలింపిక్స్‌ విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు
X

దిశ, డైనమిక్‌ బ్యూరో:ప్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. అదే విధంగా జావలిన్‌త్రో ఈవెంట్‌లో నీరజ్‌ చోప్రా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. విజేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో అభినందించారు. ఒలింపిక్స్‌లో మరోసారి విజయాన్ని అందుకున్న నీరజ్‌ చోప్రాను చూసి దేశం గర్వపడుతోందన్నారు. హాకీ జట్టు విజయం సాధించడం బంగారు క్షణాలని పేర్కొన్నారు.. టీమ్‌ సభ్యులకు అభినందనలు తెలిపారు. హాకీ క్రీడాకారులు తప్పకుండా పతకం సాధిస్తారని క్రీడాభిమానులు నమ్మకంతో ఉన్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా నీరజ్‌ చోప్రాకు, హాకీ జట్టుకు మాజీ సీఎం జగన్‌ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed