- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap news: విద్యాకమిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన విద్యా కమిటీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికలు ఒంటి గంట వరకు సాగాయి. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఫలితాలు కూడా విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి.
తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం బూదూరులో పాఠశాలల విద్యాకమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో వైసీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా మంత్రాలయంలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అయితే ఇందులో రాజకీయాలు జోక్యం చేసుకున్నాయి.. విద్యా కమిటీ ఎన్నికల్లో అభ్యర్థులకు వైసీపీ, టీడీపీ మద్దతు ప్రకటించాయి. ఎన్నికలు జరుగుతుండగా పాఠశాల వద్దకు రెండు వర్గాలు భారీగా చేరుకున్నాయి. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.