తిరుపతి లోకల్స్‌కు గుడ్ న్యూస్.. రేపటి నుంచి ఉచితంగా శ్రీవారి దర్శనం టోకెన్లు

by srinivas |
తిరుపతి లోకల్స్‌కు గుడ్ న్యూస్.. రేపటి నుంచి ఉచితంగా శ్రీవారి దర్శనం టోకెన్లు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి వాసుల(Tirupati People)కు టీటీడీ(TTD) గుడ్ న్యూస్ తెలిపింది. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు రేపటి నుంచి ఉచితంగా శ్రీవారి దర్శనం టికెట్లు(Srivari Darshan tickets) జారీ చేయనుంది. తిరుపతి మహతి ఆడిటోరియంలో 2500 టికెట్లు, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో 500 టోకెన్లు అధికారులు ఇవ్వనున్నారు. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మాత్రమే ఈ టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ టికెన్లు తీసుకున్న వారికి ఎల్లుండి(మంగళవారం రోజున) శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.

అయితే శ్రీవారి దర్శనం టికెట్ తీసుకునేందుకు స్థానికులు ఆధార్‌కార్డ్ ఒరిజినల్ కచ్చితంగా చూపించాలని అధికారులు పేర్కొన్నారు. ముందుగా వచ్చిన వారికి మాత్రమే తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. టికెట్లు పొందిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పుట్‌పాత్ హాల్ (దివ్య దర్శనం) క్యూలైన్‌ ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. ఇతర దర్శనాల్లో మాదిరిగానే భక్తులకు లడ్డూ ఉచితంగా అందజేస్తామని తెలిపారు. తిరుపతి స్థానికులు ఒకసారి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మళ్లీ 90 రోజులు తర్వాతే అవకాశం కల్పిస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed