Tirumala: శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా

by srinivas |   ( Updated:2023-01-27 12:05:38.0  )
Tirumala: శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా
X
  • త్వరలో మరో తేదీ నిర్ణయం
  • - టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దాదాపు 6 నెలల పాటు పనులు వాయిదా వేస్తున్నామని..త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందని స్పష్టం చేశారు. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

ఇవి కూడా చదవండి: విశాఖకు CM YS Jagan

Advertisement

Next Story