విషాదం.. భార్యతో కలిసి బట్టలు ఉతకటానికి వెళ్లిన భర్త మృతి

by srinivas |
విషాదం.. భార్యతో కలిసి బట్టలు ఉతకటానికి వెళ్లిన భర్త మృతి
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం వడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో రెడ్డి అనే వ్యక్తి భార్యతో కలిసి బట్టలు ఉతికేందుకు లక్ల కుంటకు వెళ్లారు. అయితే కుంటలో ప్రమాదవశాత్తు గల్లంతు అయ్యారు. ఈతరాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఈతగాళ్ల సాయంతో రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ సరదాగా కనిపించే రెడ్డి ఇక లేరని తెలిసి అటు గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకున్నారు. రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed