- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Target@120 days.. ఇక ఆ పార్టీకి ఓటమే..!
దిశ, తిరుపతి: టీడీపీ నాయకులు అనుభవం ఉన్న గన్‌లు అయితే జనసేన యువత బుల్లెట్లు లాంటి వారన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. గన్ లేకపోయినా బుల్లెట్లు పనికి రావని... బుల్లెట్లు లేకపోతే గన్‌లు పని చేయవన్నారు. గన్, బుల్లెట్లు కలిశాయని, జగన్‌ను గద్దె దింపడం ఖాయమని హెచ్చరించారు. బుధవారం కపిలతీర్థం వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో జరిగిన జనసేన, టీడీపీ సమన్వయ సమావేశంలో ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. జనసేన, టీడీపీ కలయికను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజలు ఆహ్వానిస్తున్నారన్నారు. అన్నదమ్ముల కలయికలా రెండు పార్టీలు ఉమ్మడిగా పని చేయాలని పిలుపునిచ్చారు. బలవంతుడైన రాక్షసుడిని ఓడించాలంటే ఈ కలయిక చాలా అవసరమన్నారు. ఇరు పార్టీలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఇప్పటి వరకు ట్రెండ్‌ను ఫాలో అయ్యామని, ఇకపై ట్రెండ్ సెట్ చేస్తామన్నారు. వైసీపీ పతనం ఖాయమని జోస్యం చెప్పారు. 2019లో ఒక్క అవకాశం అంటే ప్రజలు ఓటు వేశారన్నారు. ఇప్పుడు ఆ ఓటు వేసిన ప్రజలే కన్నీరు పెడుతున్నారని పసుపులేటి హరిప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు టీడీపీ, జనసేనకు ఓటు వేయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారని, ఆ విషయం జగన్‌కు కూడా తెలుసని పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. అయినా సరే శకుని చేతిలో పాచికలాగా దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారన్నారు. ఇప్పుడు చేయాల్సింది రాజకీయం కాదన్నారు. యుద్దానికి సిద్ధం కావాలని రెండు పార్టీల నేతలకు పిలుపునిచ్చారు. ఈ అరాచక పాలనపై ప్రజలకు భయం ఉందని, ఆ ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత రెండు పార్టీలపై ఉందన్నారు. ఏకపక్షంగా వైసీపీ కండువాలు కప్పుకొని పని చేస్తున్న వ్యవస్థలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నది పథకాలు కాదని, స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా స్వామ్యమా?, నియమనతృత్వమా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు 120 రోజుల సమయం ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ సన్నద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. తిరుమలలో అన్నం ప్రసాదంగా ఇస్తుంటే నీటిని మాత్రం 60 రూపాయలకు కొనాల్సి వస్తోందన్నారు. తిరుపతిలో ఏ విధంగా అభివృద్ధి మాటున అవినీతి జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారని పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.