Tirupati: అన్నమయ్య కూడలిలో ఉద్రిక్తత.. ఇరువర్గాల దాడిలో యువకుడు మృతి

by srinivas |
Tirupati: అన్నమయ్య కూడలిలో ఉద్రిక్తత.. ఇరువర్గాల దాడిలో యువకుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి అన్నమయ్య కూడలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మణి అనే వ్యక్తి మృతి చెందారు. మద్యం మత్తులో రోడ్డుపై యువకులు హల్ చల్ చేశారు. దీంతో వివాదం తలెత్తింది. హనీ కేటరింగ్ యాజమాని భార్యతో కలిసి వెళ్తుండగా యువకులు అడ్డుకున్నారు. కేటరింగ్ యజమానికి మద్దతుగా సిబ్బంది తరలివచ్చారు. దీంతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో యువకుడు మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మణి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story