- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yuvagalam: అడుగడుగునా అడ్డంకులు.. అయినా తగ్గని లోకేశ్
దిశ, తిరుపతి: చిత్తూరు జిల్లా సంసిరెడ్డిపల్లెలో ఉద్రిక్తత పరిస్థితుల మధ్య నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగింది. పోలీసులు అడ్డంకులు సృష్టించినా లోకేశ్ స్టూల్‌పై నిల్చుని మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు. స్టూల్‌ను సైతం లాక్కున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. లోకేశ్‌కు మైక్ ఇచ్చే ప్రయత్నం చేసిన టీడీపీ కార్యకర్తను కూడా అడ్డుకున్నారు. ఆయన నుంచి కూడా మైక్ లాక్కున్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని చంపేసే పరిస్థితులున్నాయని మండిపడ్డారు. .
అంతకుముందు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆత్మకూరు ముత్యాలమ్మ గుడిలో లోకేశ్ పూజలు, గుడ్ షెపర్డ్ చర్చిలో ప్రార్థనలు చేశారు. మహదేవపురంలో బొమ్మలు తయారు చేసే ఎస్సీలతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై దాడులు చేయడం తప్ప.. వారి సంక్షేమానికి ప్రత్యేకంగా ఎలాంటి ఖర్చు చేయడం లేదని దుయ్యబట్టారు.
సెల్ఫీ విత్ లోకేశ్
ఇక ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రంలో సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులు లోకేశ్‌ను కలిశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ విద్యా సంస్థల అనుమతుల పునరుద్ధరణ 10 ఏళ్లకు ఒకసారి జరిగేదని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 ఏళ్లకు ఒకసారి అనుమతులు రెన్యువల్ చేయాలన్న నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందని లోకేశ్ ఆరోపించారు. జే-ట్యాక్స్ కోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్లకోసారి రెన్యువల్ విధానాన్ని పునరుద్ధరిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.