- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థానిక నాయకులకే కూటమి టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్..
దిశ,తిరుపతి:ఎన్నికల నేపథ్యంలో రసవత్తరంగా మారాయి తిరుపతి రాజకీయాలు.తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుగుబావుటా ఎగురవేశారు.నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఇవ్వద్దని జనసేన సీటు తనకి ఇస్తే ఆ పార్టీలో చేరుతానని ప్రకటన చేశారు.మంగళవారం టీడీపీ ముఖ్య నేతలతో తిరుపతి లోని ప్రైవేట్ హోటల్లో సుగుణమ్మ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అనివార్య పరిస్థితి కానీ స్థానికేతరులకు టికెట్ ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు.తిరుపతి అభ్యర్థి విషయంలో పునరాలోచన చేయాలని స్థానికులకే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నామన్నారు.
స్థానిక జనసేన నేతలు కూడా ఇదే కోరుతున్నారని చెప్పారు. అవసరమైతే తాను జనసేన నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఫలితాలు చూసాము.తాను ఓడిపోలేదు. ఏదో చేసి ఫలితం మార్చుకున్నారనేది అందరికి తెలిసిందే అన్నారు. 5 సంవత్సరాలు కష్టపడి పని చేశాను. 100 శాతం ప్రజల్లో పార్టీ బలోపేతం చేసాననేది నా విశ్వాసం అని తెలిపారు.ఈ ఎన్నికల్లో టీడీపీ తిరుపతి లో పోటీ చేయడం లేదనేది తీరని లోటని పేర్కొన్నారు.చంద్రబాబు కూడా బాధ పడుతున్నారని చెప్పారు.అరాచక, అన్యాయం చేసే అభినయ్,కరుణాకర్ రెడ్డి విముక్తి చేయాలనేది మన ధ్యేయం అన్నారు. అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More..