- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yuvagalam: శిలాఫలకాలపై హామీలు.. ఏంటీ లోకేష్ ధైర్యం!
దిశ, తిరుపతి: టీడీపీ యువ నేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర నాలుగు వందల కిలోమీటర్లకు చేరుకుంది. ప్రతి వంద కిలోమీటర్లకు ఓ శిలాఫలకం ఆవిష్కరిస్తున్నారు. అయితే ఇందులో వినూత్నంగా తాను ఆ వంద కిలోమీటర్ల పరిధిలో ఇచ్చిన హామీలను చెక్కిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని చేయిస్తానని భరోసా ఇస్తున్నారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు సీఎం జగన్ నోటికొచ్చిన హామీలు ఇచ్చారు. ఇలా ఐదారు వందలకుపైగా ఉంటాయి. కానీ మేనిఫెస్టోలో మాత్రం పెట్టలేదు. ఇప్పుడు మేనిఫెస్టోనే అమలు చేస్తానని చెబుతున్నారు. దీంతో పాదయాత్రలో హామీలు పొందిన అనేక వర్గాలు సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి. కానీ ఆయన ఇంటి చుట్టూ శాశ్వతంగా నిషేధాజ్ఞలు విధించారు. వారంతా తాము మోసపోయామని అసంతృప్తితో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. తాము ఎలాంటి హామీలు ఇవ్వలేదని.. కావాలంటే మేనిఫెస్టో చూసుకోమని వైసీపీ నేతలు చెబుతున్నారు.
అయితే అలాంటివి తమ దగ్గర ఉండవని.. మాటంటే మాటేనని లోకేష్ నిరూపించేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. తాను ఇస్తున్న హామీలను శిలాఫలకంపై చెక్కించి ప్రతి వంద కిలోమీటర్లకుపెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవి చేయకపోతే ఆ శిలా ఫలాకాలను చూపించి ప్రజలకు తనను ప్రశ్నించే అవకాశం లభిస్తుందంటున్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ తాను అమలు చేయగలననే నమ్మకాన్ని కూడా లోకేష్ కల్పిస్తున్నారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తాడో కూడా వివరిస్తున్నారు లోకేశ్.