Tirupati: పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు.. అర్హులు వీరే..!

by srinivas |
Tirupati: పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు.. అర్హులు వీరే..!
X

దిశ, తిరుపతి: పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి డిసెంబరు 13న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ ఉతీర్ణత పొందిన విద్యార్థినులు ఈ ప్రవేశాలకు అర్హులుగా ప్రకటించారు. విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, 3 సెట్ల జిరాక్స్ కాపీలతో నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కోర్సు ఫీజుతో విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి కల్పించనున్నారు. సీట్లు పరిమితంగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం 9299008151, 9247575386, 8978993810 నంబర్లను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed