- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
దిశ, తిరుమల: శుక్రవారం రాత్రి 11 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకున్న జేపీ నడ్డాకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన వెంట తిరుమల వెళ్లారు. శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ లో బసచేసిన నడ్డా శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో జెపి నడ్డా స్వామి వారి సేవలో పాల్గొనిమొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నడ్డాకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నడ్డాతో పాటు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, సుజనా చౌదరి, సిఎం రమేష్ లు ఉన్నారు. ఆలయం వెలుపల మీడియాతో నడ్డా మాట్లాడుతూ.. శ్రీ వెంటేశ్వరుడంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయన్నారు. దేశంలో శాంతి., సంపూర్ణ అభివృద్ది సాధించేలా భగవంతుడు శక్తిని ఇవ్వాలని ప్రార్ధించానని తెలిపారు. ప్రజలంతా స్వామి వారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నానన్నారు. భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందేలా దీవించాలని ప్రార్ధించినట్లు చెప్పారు.