Tirupati: నిరంతర రాజకీయ శ్రామికుడు!

by srinivas |   ( Updated:2023-04-20 14:31:38.0  )
Tirupati: నిరంతర రాజకీయ శ్రామికుడు!
X

దిశ, తిరుపతి: ‘‘కష్టపడి పని చెయ్ ఫలితం దానంతట అదే వస్తుంది” అని చాలా మంది చెబుతూ ఉంటారు కానీ ఆచరించడం అంత సామాన్యమైన విషయం కాదు. ప్రయత్నాల్లో చిన్న ఎదురు దెబ్బ తగిలితే పూర్తిగా నీరుగారి పోతారు. పూర్తిగా కిందపడిపోతే ఇక నాకెందుకు అనుకునేవారే ఉంటారు. కానీ కిందపడినా… మళ్లీ లేచి పరిగెట్టే వాళ్లే లక్ష్యాన్ని చేరుకుంటారు. నిజానికి ఇలాంటి స్ఫూర్తితో ఉండేది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మ అన్నారు. తిరుపతిలో గురువారం మాజీ ఎంఎల్ఏ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జన్మ దిన వేడుకలు జరుపుకున్నారు. పలుచోట్ల అన్నదానం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన సందర్భంగా అలిపిరి నందు టెంకాయలు కొట్టే కార్యక్రమం, టౌన్ క్లబ్ నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక కమిటీ నాయకులు సత్తు మధుసూదన్ యాదవ్ రావెళ్ల సుబ్బరాయుడు నాయుడు నాగేంద్రప్రసాద్ లక్ష్మీపతి నాయుడు కె.వి రమణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సత్తు మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త చంద్రబాబు నిండు నూరేళ్లు నిండు జీవించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని దేవుడి కోరుకోవడం జరిగిందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గెలవాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఇక చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా టౌన్ కబ్ నందు తారక రామారావు విగ్రహం కూడలి నందు భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం తెలుగు ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రక్తదానం చేశారు.

ఇవి కూడా చదవండి : Visakha: వచ్చే ఎన్నికలపై సంచలన విషయం చెప్పిన ఎంపీ జీవీఎల్

Advertisement

Next Story

Most Viewed