- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Srikalahasti: నెల గడుస్తున్నా అందని ద్రాక్షగానే పదవి!
దిశ, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో వైసీపీకి జవసత్వాలు నింపిన వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, మాజీ ఆప్కో డైరెక్టర్ మిద్దిల హరికి నామినెటెడ్ పదవి ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చి పది రోజులుగడిచిపోయాయి. అయినా మిద్దిల హరికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి రాకపోవడంతో ఈ సారి కూడా మిద్దిల హరికి నామినేటెడ్ పదవి హుళక్కే అని కొంత మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత నాలుగేళ్లుగా వైసీపీలో అదిగో నామినేటెడ్ పదవి..? ఇదిగో నామినేటెడ్ పదవి అంటూ హామీలు ఇవ్వడమే కానీ అమలకు నోచుకోపోవడంతో ఆయన విరక్తి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరలో టీడీపీలో తన అనుచరగణంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసి చేరుతారాని జోరుగా ప్రచారం సాగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సీఎం వద్దకు మిద్దిల హరిని తీసుకెళ్లి మరో పది రోజుల్లో ఖచ్చితంగా నామినేటెడ్ పదవి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని మిద్దిల హరి ప్రటించారు.
అయినా సీఎం హామీ ఇచ్చి దాదాపుగా నెల కావస్తున్నా నామినేటెడ్ పదవి మిద్దిల హరికి అందని ద్రాక్షగానే మిగిలింది. దీంతో మాజీ ఆప్కో డైరెక్టర్ మిద్దిల హరి అనుచరులు తీవ్ర నైరాశ్యానికి గురి అవుతూ మిద్దిల హరిపై ఒత్తిడి పెంచుతూ వున్నారని సమాచారం.