- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డిక్లరేషన్ ఇస్తే నీ అహం పోతుందా జగన్?’.. మాజీ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, తిరుపతి: మానవత్వం, సెక్యులరిజం, దళితులు, అవినీతి గురించి మాట్లాడేందుకు జగన్ సరైన వ్యక్తి కాదని కేంద్ర మాజీ మంత్రి & కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న(శనివారం) జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. జగన్ ప్రసంగం నాకంత ఆహ్లాదకరంగా అనిపించలేదన్నారు. జగన్ 2004 ముందు మీ ఇంటి ఆస్తులు ఎంత? నేడు మీ కుటుంబం ఆస్తులు ఎంత? అవినీతి గురించి నీకు మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. జగన్‌కి ప్రజాదరణ పూర్తిగా పోయింది. నాలుగేళ్లు సైలెంట్‌గా ఉండడం మంచిదని హితవుపలికారు.
ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేసి, దళిత విద్యార్థులకు స్కాలర్షిప్‌లు ఆపేసి, నేడు దళితుల గురించి జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నిన్నా మొన్నటి వరకు మోడీ అమిత్ షా లకు జగన్ ముద్దులు పెట్టాడు. ఐదేళ్లు బీజేపీ భజన చేసిన జగన్, ఓడిపోగానే సెక్యులరిజం గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. తిరుమల లో డిక్లరేషన్ ఇస్తే నీ అహం పోతుందా?అడిగారు. సంతకం చేసి ఇస్తే సరిపోయేదని సూచించారు. టీటీడీలో అవినీతి ఉందని నేను చెబుతూనే ఉన్నాను. సీతారాం మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. దీని గురించి దేశం మొత్తం ఆలోచించాలన్నారు.