Renigunta: రైల్వే స్టేషన్‌ ఇసుప పిల్లర్‌లో ఇరుక్కున చిన్నారి తల.. గంటపాటు నరకయాతన

by srinivas |   ( Updated:2023-07-21 13:39:26.0  )
Renigunta: రైల్వే స్టేషన్‌ ఇసుప పిల్లర్‌లో ఇరుక్కున చిన్నారి తల.. గంటపాటు నరకయాతన
X

దిశ, వెబ్ డెస్క్: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో చిన్నారికి పెద్ద ప్రమాదం తప్పింది. ఓ కుటుంబం రాజంపేట నుంచి చిత్తూరు వెళ్లేందుకు రేణిగుంట రైల్వే స్టేషన్‌కు వచ్చింది. రైలు కోసం మూడో నంబర్ ఫ్లాట్ ఫామ్‌పై ఎదురు చూస్తుండగా నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాదవశాత్తు చిన్నారి తల ఇనుప పిల్లర్‌లో ఇరుక్కుంది. దీంతో చిన్నారి గంటపాటు నరకయాతన అనుభవించింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. ఇనుప కట్టర్లతో పిల్లర్‌ను కట్ చేసి పాపను సురక్షితంగా రక్షించారు. దీంతో తల్లిదండ్రులు రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story