- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tirupati: కాంగ్రెస్‌లోకి షర్మిల.. భట్టి విక్రమార్క ఎమన్నారంటే..!
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆమె కలిశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబమంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇష్టమని భట్టి విక్రమార్క చెప్పారు. అటు వైఎస్ కుటుంబం సైతం కాంగ్రెస్‌కు వీధేయంగానే ఉందని తెలిపారు. భావోద్వేగాలతోనే కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేదే రాజశేఖర్‌రెడ్డి లక్ష్యమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చశారు. అభివృద్ధి కోసమే తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ కు బీజేపీ బీ టీమ్ అని విమర్శించారు. తెలంగాణ బీఆర్ఎస్ అధికారం కోల్పోబోతోందన్నారు. ఒక బీఆర్ఎస్ వల్ల ఒరిగేదేమీ లేదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.
కాగా తెలంగాణలో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర విజయవంతంకావడంతో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో తిరుపతికి బయల్దేరిన ఆయన కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లారు. అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధాకి నివాళులర్పించారు. అనంతరం తిరుమల చేరుకున్నారు. శ్రీవారి దర్శననంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
Read More : కాంగ్రెస్‌లో YSRTP విలీనానికి ముహూర్తం ఫిక్స్.. ఆ నియోజకవర్గం నుండే YS షర్మిల పోటీ..?
- Tags
- YS Sharmila