- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల... ఏపీ అధ్యక్షుడి రియాక్షన్ ఇదే..
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెతో ఆ పార్టీ అధిష్టానం చర్చలు సైతం జరిపినట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల ఇప్పటికే తెలంగాణలో వైఎస్సార్టీపీని స్థాపించారు. ఇప్పుడు ఈ పార్టీని కూడా హస్తం పార్టీలో విలీనం చేయబోతున్నారని తెలుస్తోంది. సోనియాగాంధీ లేదా ప్రియాంక గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారని అంటున్నారు. దీంతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పందించారు. వైఎస్ షర్మిలే కాదు.. పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఏపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయన్నారు. అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గిడుగు రుద్రరాజు జోస్యం చెప్పారు.
కాగా ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగైంది. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఏపీపై ఫోకస్ పెట్టింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలతో పాటు కేడర్ ఉండేది. దీంతో వారందరినీ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ షర్మిలను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
అటు కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మరింత యాక్టివ్ అయింది. తెలంగాణలో బలంగా ఉంది. దీంతో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయకేతనం ఎగురవేయాలని భావిస్తోంది. దీంతో అంది వచ్చే అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. ఇప్పటికే తెలంగాణలో ఆపరేషన్ ఆపరేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మాజీ నేతలు పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆ నేతలిద్దరూ కూడా త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి :: Ap News: కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల.. అన్నకు ప్రత్యర్థిగా పునరాగమనం!