భారీ మొత్తంలో ఆ పార్టీ ప్రచార సామాగ్రి సీజ్

by Jakkula Mamatha |
భారీ మొత్తంలో ఆ పార్టీ ప్రచార సామాగ్రి సీజ్
X

దిశ,తిరుపతి:రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఓ ప్రైవేట్ గోడౌన్ లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వైసీపీ ప్రచార సామాగ్రిని సీజ్ చేశారు. ప్రచార సామాగ్రికి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే ఓ ప్రైవేటు గొడన్ లో భారీ మొత్తంలో వైసీపీ ప్రచార సామాగ్రిని నిలువ చేసి ఇతర ప్రాంతాలకు ప్రభుత్వ అనుమతులు లేకుండా తరలిస్తున్నారని సమాచారంతో మంగళవారం మధ్యాహ్నం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి స్థానిక పోలీసుల సహాయంతో వాహనం నిండుగా ఉన్న ప్రచార సామాగ్రిని సీజ్ చేశారు. పోలీసు రాకను గమనించిన ప్రైవేట్ గోడౌన్ లో ఉన్న సిబ్బంది తాళాలు వేసుకొని పరారయ్యారు.

విషయం తెలుసుకున్న తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ ఇతర టీడీపీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గౌడన్ తెరిచి అందులో ఉన్న సామాగ్రిని కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గౌడన్ తెరిచే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు.శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని పేపర్ లో కథనాలు వస్తున్నా కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. టీడీపీకి సంబంధించిన కేవలం పది పాంప్లెట్లు ఉంటేనే కారును పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి నానా ఇబ్బందులు పెట్టారని ఇంత భారీగా తరలిస్తున్న వైయస్సార్ పార్టీ ప్రచార సామాగ్రిని పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు.

Advertisement

Next Story

Most Viewed