Breaking: ప్రమాదంలో పిల్లలు..వీడియోలు తీస్తూ చోద్యం చూస్తున్న పెద్దలు

by Indraja |   ( Updated:2024-02-27 11:01:47.0  )
Breaking: ప్రమాదంలో పిల్లలు..వీడియోలు తీస్తూ చోద్యం చూస్తున్న పెద్దలు
X

దిశ డైనమిక్ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా లోని ఇచ్ఛాపురం మండలం లోని డోంకురు సముద్ర తీరానికి ఓ భారీ తిమింగలం కళేబరం కొట్టుకు వచ్చింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల ప్రాంత వాసులు అదేదో వింతగా చూడడానికి ఆ ప్రాంతానికి తరలి వస్తున్నారు. అలానే ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కూడా ఆ ప్రాంతానికి వస్తున్నారు.

అభంశుభం తెలియని ఆ చిన్నారులు చనిపోయిన తిమింగలం కళేబరం పైకి ఎక్కి ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది. అయితే అలా ఏదైనా భారీ జలచరం చనిపోయి తీర ప్రాంతానికి కొట్టుకు వస్తే.. ఆ జలచరం యెక్క కళేబరం దరిదాపుల్లోకి వెళ్లడం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే చనిపోయిన భారీ జలచరం కళేబరం కుళ్ళిపోయే సమయంలో దాని శరీరం లోపల అనేక వాయువులు ఉత్పత్తి అవుతాయి.

కాగా జలచరం కళేబరంలో ఉత్పత్తి అయిన వాయులు బయటకి వచ్చే మార్గం ఉండదు. దీనితో ఆ కళేబరం ఓ బాంబులా విస్ఫోటనం (బ్లాస్ట్) అవుతుంది. అలా కళేబరం బ్లాస్ట్ అయినప్పుడు దానికి సమీపంలో ఉన్న వాళ్ళు తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. ఇక ఇలా చనిపోయిన జలచరం కళేబరం బాంబుల పేలే అవకాశం ఉందని.. అదే జరిగితే ప్రాణాలకు ప్రమాదమని తెలియని పసిపిల్లలు దానిపైకి ఎక్కి ఆనందంగా ఆడుకుంటున్నారు.

అన్నీ తెలిసన పెద్దలు మాత్రం ఆ పిల్లలకు అది జలచరం కళేబరం అని.. దాని దగ్గరకి వెళ్లడం ప్రమాదమని.. అంతే కాదు అది కూడా ఒక ప్రాణి.. ప్రాణాలు కోల్పోయిన ఆ జీవి పై అలా ఎక్కి తొక్క కూడదని.. మానవత్వంతో వ్యవహరించాలని చెప్పాల్సిన పెద్దలు మాత్రం పిల్లలు తెలియక అలా ఆ కళేబరం పైకి ఎక్కి ఆడుకుంటున్న చోద్యం చూస్తున్నట్లు చూస్తూ.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంలో బిజీగా ఉన్నారు.




Advertisement

Next Story