సభలో గందరగోళం: టీడీపీ సభ్యుల సస్పెన్షన్

by Seetharam |   ( Updated:2023-09-21 06:17:57.0  )
సభలో గందరగోళం: టీడీపీ సభ్యుల సస్పెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. సభ ప్రారంభమైన సమయం నుంచి టీడీపీ సభ్యులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ఇందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు తమ నిరసన వ్యక్తం చేశారు.స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తమ నిరసన గళం విప్పారు. అయితే తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోకుండా నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్‌లను ఈ సెషన్ మెుత్తం సస్పెండ్ చేశారు. అనంతరం సభ్యులు సభా నియమావళి పాటించాలని కోరారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టడంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. సభలోని టీడీపీ సభ్యులందరితోపాటు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా సస్పెండ్ చేయాలని తీర్మానించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానంతో వారందరినీ సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

Read More..

టీడీపీ రిలే దీక్షలో మహిళా నేత మృతి.. లోకేశ్ విచారం

Advertisement

Next Story