ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు మరో లేఖ

by Satheesh |
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు మరో లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయి వందలాది మంది ఆంధ్రప్రదేశ్ పౌరులు కంబోడియా‌లో చిక్కుకున్నారని, కంబోడియాలో ఇరుక్కుపోయిన బాధితులను క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావాలని లేఖలో కోరారు. యువతను రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సహయక చర్యలు స్పీడప్ చేయాలని కోరారు. కాగా, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట మోసపోయిన తెలుగు యువతతో కాంబోడియాలో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నట్లు ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తులో ఈ విషయం బయటపడింది.

Advertisement

Next Story

Most Viewed