BREAKING: రాజమండ్రి రూరల్ సీటుపై చంద్రబాబు కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2024-02-24 09:42:39.0  )
BREAKING: రాజమండ్రి రూరల్ సీటుపై చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ- జనసేన పొత్తు పెట్టుకోవడంతో రాజమండ్రి రూరల్ హాట్ సీటుగా మారింది. ఈ స్థానం నుండి టీడీపీ, జనసేన ఆశావాహులు ఇద్దరూ పోటీకి సై అంటున్నారు. టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి మరోసారి పోటీకి రెడీ అవుతుండగా.. జనసేన నుండి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ రాజమండ్రి రూరల్‌లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. రాజమండ్రి రూరల్ నుండి మరోసారి తానే పోటీ చేస్తానని.. జనసేన పోటీ చేస్తున్నట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని బుచ్చయ్య చౌదరి జనసేన పోటీ వార్తలను కొట్టి పారేశారు. దీంతో రాజమండ్రి రూరల్‌లో టీడీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్ మొదలైంది.

ఈ క్రమంలో హాట్ సీటుగా మారిన రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాజమండ్రి రూరల్ సీటు విషయంలో అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ టికెట్ ఆశిస్తున్న ఇద్దరు ఆశావాహలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని.. బుచ్చయ్య చౌదరి, కందుల దుర్గేష్ చెరో చోట బరిలో ఉంటారని క్లారిటీ ఇచ్చారు. ఒకరు రాజమండ్రి రూరల్, మరొకరు వేరే చోటు నుండి పోటీ చేస్తారని బాబు స్పష్టం చేశారు. కాగా, ఇవాళ టీడీపీ-జనసేనల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 118 మంది అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్‌ను అనౌన్స్ చేశారు. ఇందులో టీడీపీకి 94 సీట్లు, జనసేనకు 24 సీట్లు కేటాంచారు. కానీ ఈ లిస్ట్‌లో తీవ్ర పోటీ ఉన్న రాజమండ్రి రూరల్ అభ్యర్థిని ప్రకటించలేదు.

Read More..

టీడీపీ,జనసేన జాబితాలో సీనియర్ల కే పెద్దపీట!

Advertisement

Next Story

Most Viewed