చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలి: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్

by Seetharam |   ( Updated:2023-09-03 12:04:48.0  )
చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలి: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై వివరణ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదాయ పన్ను శాఖ చట్ట ప్రకారమే పనిచేస్తున్నారు. ఏ వ్యక్తి, సంస్థల ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో తేడాలుంటే ఐటీ శాఖ నోటీసులు ఇస్తారు అని చెప్పుకొచ్చారు. అలా ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. 2014-19లో రూ.118 కోట్లు మనీ ల్యాండరింగ్‌ ద్వారా చంద్రబాబుకు అందించామని మనోజ్ పార్థసాని చెప్పారని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. సెంట్రల్ ఐటీ శాఖకు విచారణ పరిధి లేదని.. ఫలానా ఆఫీసు చేయాలని టెక్నికల్ ఇష్యూను చంద్రబాబు లేవనెత్తారు కానీ.. సమాధానం ఇవ్వలేదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉంది. కేవలం ఐటీ శాఖకు లేఖలు రాసారే తప్ప ఆరోపణలను చంద్రబాబు ఖండించలేదు.ముడుపులు తీసుకోలేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు అని మాజీమంత్రి డొక్కా మాణిక్యప్రసాద్ నిలదీశారు. ఐటీ నోటీసులపై సమాధానం చెప్పకపోతే చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాలి అని డొక్కా మాణిక్యవరప్రసాద్ సూచించారు. కేంద్రంలో అనేకసార్లు ప్రభుత్వాన్ని నడిపించానని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఐటీ నోటీసులకు సమాధానం చెప్పరని నిలదీశారు. కనీసం ఒక రింగ్‌ కూడా లేదని హరిశ్చంద్రుడిని అంటూ పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏం చెబుతారు? అని నిలదీశారు. ‘విక్కీ జైన్, మనోజ్ పార్థసాని ఎవరో చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారని ఐటీ శాఖ చెబుతోంది. ఒకవేళ విక్కీ జైన్ ఎవరో చంద్రబాబుకు తెలియదని చెప్పమనండి. వాళ్ల వాట్సాప్‌ చాట్స్‌లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. చంద్రబాబు పేరును ఐటీ శాఖకు వాళ్లు చెప్పారు. ఐటీ శాఖ పూర్తిగా దర్యాప్తు చేస్తే మరింత డబ్బు వివరాలు బయటపడతాయి’ అని డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పుకొచ్చారు.

విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకోవాలి

చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన అనేక లావాదేవీల్లో ఐటీ శాఖ కేవలం రూ.118 కోట్లను మనోజ్ పార్థసాని ద్వారా పట్టుకున్నారు అని డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు. నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ పరిధి గురించి చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఐటీ నోటీసులు జూబ్లిహిల్స్‌ శాఖ మాత్రమే ఇవ్వాలని, సెంట్రల్ ఆఫీస్ ఎలా ఇస్తుంది అనటం కాదు అని చెప్పుకొచ్చారు. ఇది చంద్రబాబు చేయాల్సిన పనికాదు. అవన్నీ చంద్రబాబు కోర్టుల్లో తేల్చుకోవాలి. ప్రజాజీవితంలో ఉన్న ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా ప్రజలకు ఐటీ నోటీసులపై వివరణ ఇవ్వాలి. విక్కీ జైన్, మనోజ్ పార్థసాని తెలియదని.. ఆ డబ్బు రాలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది అని సూచించారు. తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలి అని కోరారు. ఐటీ శాఖ ఆధారాలతో సహా నోటీసు ఇచ్చింది. తర్వాత సీబీఐ క్రిమినల్ చార్జిషీటు దాఖలు చేయటం ఆటోమ్యాటిక్‌గా జరుగుతుంది అని స్పష్టం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. కేంద్ర సంస్థలు, సీబీఐ, ఐటీ దర్యాప్తు చేయాలి. విక్కీ జైన్, మనోజ్ పార్థసానినితో పాటు దీనివెనుక ఉన్న పెద్దలూ వస్తారు. తద్వారా ప్రజాధనం ఎంత వెనకుందో తెలుస్తుంది. ఎన్టీఆర్‌ నాణెం విడుదల రోజున చంద్రబాబు పడిన అవస్థలు చూడలేకపోయాం. నడ్డాను బ్రతిమిలాడటానికి చంద్రబాబు చాలా ప్రయత్నించారు అంటూ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed