ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. YCPకి కౌంటర్‌గా వేదిక ఫిక్స్

by Rajesh |   ( Updated:2024-06-04 06:59:22.0  )
ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. YCPకి కౌంటర్‌గా వేదిక ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. కాగా టీడీపీ 136 స్థానాల్లో, జనసేన 20 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. వైసీపీ 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రతిపక్షానికి 18 సీట్లు అవసరం అవగా కేవలం 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగడంతో ఈ విషయంలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ నెల 9 న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 4వ సారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Next Story