ఈనెల 7న ఢిల్లీకి చంద్రబాబు

by Seetharam |
ఈనెల 7న ఢిల్లీకి చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక రాజకీయంగా దూకుడు పెంచనున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. జైలు నుంచి రెగ్యులర్ బెయిల్‌పై విడుదలైన అనంతరం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించి మెుక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవలే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం సైతం నిర్వహించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన విధానం.. లేవనెత్తాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్రంలోని ఓట్ల అక్రమాలపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడు ఈ ఓటర్ల జాబితాలో అక్రమాలపై హస్తిన వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 7న చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఈసీని కలిసి ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న సీఈసీకి చెందిన బృందం ఏపీకి రానుంది. ఈ నేపథ్యంలో వారు రాష్ట్రానికి రాకముందే సీఈసీని కలిసి ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ టూర్ ఖరారైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ఎంపీలు సైతం సీఈసీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు

మిచౌంగ్ తుపాను నేపథ్యంలో పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు..నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు. విస్తృతంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. అత్యవసరమైన చోట నాయకులు, కార్యకర్తలు తమవంతు సాయం అందించాలని...ప్రజలకు నిత్యావసరాలు అందించాలని, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహకరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed