AP News:కొడాలి నానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-06-13 15:42:00.0  )
AP News:కొడాలి నానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2024 ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది. వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. నూతనంగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్ ఇచ్చింది. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఐదోసారి గుడివాడ నుంచి పోటీ చేసిన కొడాలి నాని టీడీపీ పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో 53 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

వివరాల్లోకి వెళితే..చంద్రబాబు సర్కార్ కొడాలి నానికి ఉన్న భద్రతను ఉపసంహరించుకుంది. ఇప్పటి వరకు కొడాలి నాని నివాసం దగ్గర ఉన్న భద్రతా సిబ్బందితో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా తొలగించారని సమాచారం. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సాధారణంగా ప్రభుత్వం మారిన సమయంలో మాజీ మంత్రుల భద్రతను తొలగిస్తుంటారని చెబుతున్నారు. అయితే ఇటీవల కొడాలి నాని నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కోడిగుడ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇలాంటి సమయంలో భద్రతను ఉపసంహరించడం పై జోరుగా చర్చ జరుగుతోంది.

Read More...

బాబు క్షమించినా.. వాళ్లను నేను క్షమించ: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story