- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో జగన్ ధర్నా.. అసెంబ్లీ వేదికగా చిట్టా విప్పిన చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. అయితే జగన్ ధర్నాకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్ హయాంలో పెట్టిన కేసుల చిట్టాను చంద్రబాబు విప్పారు. తనతోపాటు పవన్ కల్యాణ్ పైనా అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. ‘‘ప్రతిపక్ష నాయకులు, ప్రముఖులు, వివిధ వర్గాల వారిపైనా కేసులు పెట్టారు. ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్‌పై అక్రమంగా కేసులు పెట్టి చివరకు చంపేశారు. 4 వేల మంది సీపీఎస్ ఉద్యోగులపైనా కేసులు పెట్టారు. టీచర్లను వదిలిపెట్టలేదు. కేసులు నమోదు చేసి వేధించారు. జడ్జిలపై పోస్టింగులు పెడితే సీబీఐ కేసు టేకప్ చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడిపైనా కేసులు నమోదు చేశారు. కోడెల శివప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టి అవమానించారు. గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున మహిళలు మిస్సయ్యారు. అమరావతి మహిళా రైతుల బాత్‌రూమ్‌లపై డ్రోన్లు ఎగరేశారు. జగన్ అకాశంలో హెలికాప్టర్‌లో వెళితే కింద పరదాలు కట్టారు. చెట్లు కొట్టారు. ఆలయాలపై దాడులు, దోపిడీలు చేశారు. వివేకా హత్య కేసులో తప్పులు చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సీబీఐ అధికారులపైనా కేసులు నమోదు చేశారు. కోడి కత్తి, గులకాయి డ్రామాలాడారు. గంజాయి లేని వీధి, ఊరు లేదు. ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ తన హయాంలో శాంతి భద్రతలపై ఏనాడైనా సమీక్ష నిర్వహించారా..?.’’ అని ప్రశ్నించారు.