- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పార్టీలో వారి కుటుంబానికే చంద్రబాబు నాయుడు విశేష ప్రాధాన్యం
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న (జూన్ 12)నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 17 మందికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేనివారున్నారు. అందులో కేవలం ఏడుగురికి మాత్రమే గతంలో పలు సందర్భాల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పటివరకు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించని వారికి సైతం చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి గెలిచిన వారిని కూడా మంత్రి పదవి వరించింది. అయితే నేడు చంద్రబాబు మంత్రులకు శాఖలు ప్రకటించారు. అందులో దివంగత కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు కుటుంబానికి చంద్రబాబు నాయుడు పార్టీలో, ప్రభుత్వంలో విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడును కేంద్రమంత్రిని చేశారు. ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడుకు మంద్రి పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఎర్రన్నాయుడు అల్లుడు (కూతురు భవాని భర్త) వాసు ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. భవాని సైతం ఎమ్మెల్యేగా పని చేశారు.