ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ..? సీఎంకు చంద్రబాబు కౌంటర్

by Satheesh |   ( Updated:2022-12-15 07:05:08.0  )
ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ..? సీఎంకు చంద్రబాబు కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''సొంత బాబాయ్ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ. అది కూడా నువ్వు సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్ రెడ్డీ..?'' అంటూ జగన్‌ను టార్గెట్ చేశారు. అబ్బాయి కిల్డ్ బాబాయ్.. జగన్ రాజీనామా చేయాల్సిందే అంటూ చంద్రబాబు హ్యాష్ ట్యాగ్‌లు కూడా పెట్టారు.

ఇక, వివేకా కేసు విచారణను వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని కొరుతూ వివేకా కుమార్తే సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏపీ కేంద్రంగా జరుగుతున్న వివేకా హత్య కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

Advertisement

Next Story