Breaking News: సీఈసీతో చంద్రబాబు భేటీ.. పలు అంశాలపై చర్చ

by Indraja |
Breaking News: సీఈసీతో చంద్రబాబు భేటీ.. పలు అంశాలపై చర్చ
X

దిశ వెబ్ డెస్క్: తెలుగుదశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్‌ తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను ఆయనతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రం లో ఎప్పుడు లేని విధంగా.. కనివిని ఎరువుని రీతిలో అరాచకాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని అయన మండిపడ్డారు. వైసీపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలపై, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు ఆరోపించారు.

ఇప్పుడు ప్రజలు మేలుకొన్నారని.. ప్రజలు చైతన్యభరితులై తిరుగుబాటు చేయడంతో వైసీపీ నకిలీ ఓట్ల బాటపట్టేందుకు కుట్ర పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధులకు అనుభవం ఉండే వ్యక్తులను నియమించుకోవాలని.. ఎవరైనా ఎన్నికలను అపహాస్యం చేసేలా సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా? అని ప్రశ్నించారు. ఇక 2600 మంది మహిళా పోలీసులను బీఎల్‌వోలుగా పెట్టారని.. అన్యాయంగా టీడీపీ, జనసేన పై 6 వేల నుంచి 7 వేల అక్రమ కేసులు పెట్టారని.. కేవలం ఒక్క పుంగనూరు కేసులోనే 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎవరినీ పని చేయనీకుండా చేసేందుకే జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని.. అనవసరంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed