దొంగ ఓట్ల సృష్టికర్త చంద్రబాబు...సంక్షేమం సృష్టికర్త వైఎస్ జగన్ : మంత్రి మేరుగ

by Seetharam |   ( Updated:2023-08-29 08:14:24.0  )
దొంగ ఓట్ల సృష్టికర్త చంద్రబాబు...సంక్షేమం సృష్టికర్త వైఎస్ జగన్ : మంత్రి మేరుగ
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున జోస్యం చెప్పారు. ఓటమి ముందే గ్రహించిన చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిని ఎందుకు చేయాలని కోరుకుంటారన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారని.. కనీసం చెప్పుకునేందుకు ఒక్క పథకం అయినా ఉందా అని మంత్రి మేరుగు నాగార్జున నిలదీశారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దొంగ ఓట్ల సృష్టికర్త అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు చంద్రబాబు సృష్టించారని ఆరోపించారు. కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేసేందుకు ఏమార్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అంతేగానీ ఏనాడూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేయలేదని విమర్శించారు.కరోనా సమయంలో రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయిన చంద్రబాబు.. మళ్ళీ రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు వస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక సామాజిక విప్లవానికి తెర తీశారని మంత్రి మేరుగ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా అసమానతలు లేకుండా, అశ్రుత పక్షపాతం లేకుండా చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.పేద ప్రజల గుండెచప్పుడుగా పరిపాలన జరుగుతోందని...మును పెన్నడ లేనివిధంగా ఒక లక్ష 50 వేల కోట్ల రూపాయలు డిబిటి రూపేనా సీఎం జగన్‌ ప్రజల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు అని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed