- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తిరుమల కొండపై నాన్‌వెజ్ తీసుకొచ్చారు.. వెంకన్నకు ద్రోహం తలపెడితే శిక్ష తప్పదు: చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ నూతన సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అర్చకులు అందించారు. అనంతరం తిరుమలలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు. తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దు, వినిపించొద్దని సీఎం చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో తిరుమలను అధ్వానంగా మార్చారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. దర్శనం కోసం బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై నాన్ వెజ్ తీసుకొచ్చారని.. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదనన్నారు. వెంకటేశ్వరస్వామిని ఊరూరు తిప్పారని అన్నారు. పెళ్లి, పేరంటానికి శ్రీవారిని తీసుకెళ్లారని, వెంకన్నను కూడా సొంత అవసరాకు వాడుకున్నారని మండిపడ్డారు. తిరుమలలో రాజకీయాలు చేయాలనుకుంటే కుదరవని వార్నింగ్ ఇచ్చారు. వెంకన్నకు ద్రోహం తలపెడితే ఈ జన్మలోనే శిక్ష తప్పదని కౌంటర్ ఇచ్చారు. తిరుమల మొత్తం ప్రక్షాళన చేస్తామని తెలిపారు.