వైద్యుల అబర్జ్వేషన్‌లో చంద్రబాబు: ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స

by Seetharam |
వైద్యుల అబర్జ్వేషన్‌లో చంద్రబాబు: ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. చంద్రబాబు నాయుడు ఒకరోజుపాటు ఆస్పత్రిలో అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డ చంద్రబాబు నాయుడు ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం చంద్రబాబు నాయుడు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు... ఆయన ఆసుపత్రిలో చేరితే బాగుంటుందని తెలిపారు. వైద్యుల సూచనతో చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఇకపోతే షెడ్యూల్ ప్రకారం ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంది. అక్కడ కూడా చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకుని కాటరాక్ట్ ఆపరేషన్‌పై వైద్యుల సూచనలు సలహాలు తీసుకోవాల్సి ఉంది. అయితే వైద్యులు ఆస్పత్రిలో చేరాలని ఉండటంతో అది వాయిదా పడింది.

వెన్నునొప్పితో చంద్రబాబు

ఇకపోతే చంద్రబాబు నాయుడుకు గత కొన్నేళ్లుగా స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. అయితే ఏపీ స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దాదాపు 53 రోజులుగా చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చంద్రబాబుకు కంటి సమస్యలతో బాధపడుతున్నారని ఈ నేపథ్యంలో కుడి కంటి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. మరోవైపు సెంట్రల్ జైలులో ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యారు. అలాగే స్కిన్ అలర్జీ పెరిగింది. దీంతో చంద్రబాబు వీపు, నడుము, చాతి, చేతులు, గడ్డం తదితర ప్రాంతాల్లో ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పడినట్లు వైద్యలు అప్పట్లో తన నివేదికలో వెల్లడించారు. మరోవైపు చంద్రబాబుకు వెన్నునొప్పి కూడా బాధించింది. అలాగే ఫిషర్ సమస్యతో కూడా చంద్రబాబు నాయుడు బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. వీటితోపాటు బీపీ, షుగర్ లాంటి రెగ్యులర్ ఆరోగ్య సమస్యలు కూడా చంద్రబాబును వేధిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story